BREAKING : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు ఘోర ప్రమాదాలు.. డీసీఎంను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు..!
BREAKING : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు ఘోర ప్రమాదాలు.. డీసీఎంను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు..!
మిర్యాలగూడ,(వేములపల్లి), మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో రెండు వేరువేరు ఘోర ప్రమాదాలు సంభవించాయి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డి సి ఎం ను ఢీకొట్టడంతో ఒక ప్రమాదం సంభవించగా అదుపుతప్పి మరో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ రెండు సంఘటనలు ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నాయి.
వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో అద్దంకి , నార్కట్ పల్లి రహదారిపై బాపట్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు డిసిఎంను ఢీ కొట్టింది. ట్రావెల్స్ బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ముందు భాగంలో కూర్చున్న మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలైన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సులో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ట్రావెల్స్ బస్సు నిద్ర మత్తులో ఉండటం వలన ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా భావిస్తున్నారు.
అదేవిధంగా వేములపల్లి సమీపంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు బోల్తా ఘటనలో బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు.
స్వల్ప గాయాలు కావడంతో పలువురిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు జగిత్యాల నుంచి దర్శి వెళ్తున్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిద్ర మొత్తం ఉండటం వల్లనే ఈ ప్రమాదం కూడా సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
LATEST UPDATE :
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!
మిర్యాలగూడ : టీ స్టాల్ లో అక్రమంగా మద్యం..!
HYDRA : హైడ్రా హడల్.. కూల్చేది 134 చెరువుల్లో అన్ని వేల నిర్మాణాలున్నయా..!
HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!









