సూర్యాపేట : అప్పులు తీర్చేందుకు ఆ ఇద్దరు కలిసి..!

సూర్యాపేట : అప్పులు తీర్చేందుకు ఆ ఇద్దరు కలిసి..!

సూర్యాపేట, మనసాక్షి :

కోదాడ పట్టణానికి చెందిన గుంజ వేలాద్రి, వేముల బాలకృష్ణ అనే నేరస్థుల నుంచి నాలుగు లక్షల నగదు, 750 గ్రాముల వెండి పళ్ళెం, రెండు వందల గ్రాముల విలువగల ఒక జత వెండి పట్టీలు, హీరో హోండా ఫ్యాషన్ ప్లస్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

 

జిల్లా కేంద్రంలోని సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వీరికి ముద్దాయిలుగా నేరచరిత్ర ఉన్నదని గుంజి వేలాద్రి కి ప్రమాదం జరిగి కాలుకు తీవ్ర గాయమై అప్పుల పాలు కావడంతో రెండో నిందితుని పిల్లల అనారోగ్యం పాలు కావడంతో దాంతో ఇద్దరు అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేద్దామని భావించి గుంజు వేలాద్రి కి పట్టణంలోని ఆజాద్ నగర్ చెందిన వరుసకి తాత అయ్యే కారుమంచి శ్రీను ఇంట్లో సుమారు వారం క్రితం గడ్డపారతో పగుల కొట్టి బీరువాలో ఉన్న నాలుగు లక్షల నగదు, ఒక వెండి పళ్ళెం, ఒక జత వెండి పట్టిలు దొంగిలించి వాటిని సమానంగా పంచుకున్నారు.

కాగా సోమవారం కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి స్కూల్ నందు కోదాడ పట్టణ సిఐ,పి, ఆంజనేయులు, ఎస్ఐ ఎం, రామాంజనేయులు, బి,ప్రవీణ్ కుమార్ సిబ్బంది ఎల్లారెడ్డి, కొండలు, సతీష్ వెహికల్, వెహికల్ చెకింగ్ చేస్తుండగా బైక్ మీద అనుమానాస్పదంగా వెళుతుండగా వారిని ఆపడానికి ప్రయత్నించగా ఆపకుండా పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నగా వారి వద్ద నుండి వెండి పళ్ళెం ,పట్టీలు దొరికాయని పేర్కొన్నారు.

 

ఈ మేరకు అనుమానించిన అదుపులోకి తీసుకొని విచారించగా తాము చేసిన ఆజాద్ నగర్ కు నందు చేసి న దొంగతనం గా ఒప్పుకున్నారు. అంతేగాక దొంగలించిన మొత్తం సొత్తు ఈరోజు ఉదయం వెండి పళ్లెం పట్టీలను విక్రయించడానికి గాను బైక్ మీద జగ్గయ్యపేట వెళుతున్నట్లుగా ఒప్పుకున్నారు.

 

దొంగిలించిన మొత్తం సొత్తు విలువ ఐదు లక్షలు ఉంటుందని అరెస్టు చేసిన ముద్దాయిలను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. చాకచక్యంగా ఈ సొత్తు కేసులో చేదించడానికి ప్రదర్శించిన కోదాడ టౌన్ సిఐ పి, ఆంజనేయులు, ఎస్ఐ, ఎమ్, రామాంజనేయులు, బి, ప్రవీణ్ కుమార్,

 

లు సిబ్బంది ఎల్లారెడ్డి, కొండలు, సతీష్ ,కోదాడ డిఎస్పీ జి, వెంకటేశ్వర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఎస్పీ, ఎస్, రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా వారిని అభినందించారు ఈ కేసును చేదించిన సిబ్బందికి ఎస్పీ రివార్డ్స్ ప్రకటించారు.