జల్పల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జల్పల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

మహేశ్వరం, మన సాక్షి:

మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభించిందని పహాడి షరీఫ్ పోలీసులు తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే పహాడీషరీఫ్ పోలీసులు చెరువు దగ్గరికి చేరుకొని చెరువు లో ఉన్న మృతదేహాన్ని స్థానికుల సహాయం తో బయటకు తీసి పరిశీలించగా మృతదేహం మగ మనిషిగా తెలిసిందని,

 

వయస్సు దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరములు ఉంటాయని శవం మీద నలుపు,తెలుపు చెక్ షర్ట్ ఫుల్ హాండ్స్, మెరున్ కలర్ డ్రాయర్ ఫుల్ చెరువు పక్కన నీలిరంగు ప్యారాగాన్ చెప్పులు, బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్ లబ్యమైనవని కావున ఎవరైనా మిస్సింగ్ అయినా పురుషులు ఉన్నచో పైనా తెలిపిన వస్తువులతో సరిపోల్చి పహాడీషరీఫ్ పోలీసు లకు సంప్రదించలని పహాడి షరీఫ్ పోలీసులు తెలిపారు.