శంకర్‌పల్లి : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..!

గుర్తుతెలియని మృతదేహం లభించిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధి రైల్వే ట్రాక్ పక్కన లేగసి విలేజ్ వెంచర్ దగ్గరలో మృతదేహాన్ని గుర్తించామన్నారు.

శంకర్‌పల్లి : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..!

శంకర్‌పల్లి,  (మన సాక్షి):

గుర్తుతెలియని మృతదేహం లభించిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధి రైల్వే ట్రాక్ పక్కన లేగసి విలేజ్ వెంచర్ దగ్గరలో మృతదేహాన్ని గుర్తించామన్నారు.

మృతుడి ఒంటిపై తెలుపు రంగు చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, కుడి చేయి మణికట్టుపై కుమార్ అని వ్రాసి ఉందని తెలిపారు. మృతుడికి 35 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సిఐ పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

ALSO READ : BREAKING : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ.. బిజీ, సీనియర్లకు ఆహ్వానం..!