TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. యాసంగిలో కేవలం 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పంట సహాయం అందింది. మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.

అంతే కాకుండా వానకాలం సీజన్ కూడా వచ్చింది. రైతు భరోసా కు సంబంధించి పాత నిధులే విడుదల చేయకపోవడం వల్ల.. ఈ సీజన్ రైతు భరోసా ఎప్పుడు వస్తుందో..? రాదో..? అని రైతుల్లో అనుమానాలు ఉన్నాయి. అంతే కాకుండా రైతు భరోసా పథకం పై రైతుల్లో నిరాశ కలుగుతుంది. యాసంగి సీజన్ కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైతులు ఇంకా ఎప్పుడు.. ఎప్పుడా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో రైతు మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతు భరోసా పై క్లారిటీ ఇచ్చారు. వానాకాలం వరి నాట్లు వేసే లోపే రైతులకు రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు.

అయితే రైతు భరోసా పథకం పై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రైతు భరోసా నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని త్వరలో రైతులకు రైతు భరోసా పథకం ద్వారా వారి వారి ఖాతాలలో నిధులు జమ చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పంట కాలంలో 35 వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు.

MOST READ : 

  1. Gold Price : ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!

  2. Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!

  5. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  6. Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!

మరిన్ని వార్తలు