Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : యూరియా గోస.. బస్తాల కోసం బారులు..!

Suryapet : యూరియా గోస.. బస్తాల కోసం బారులు..!

చివ్వెంల, మన సాక్షి:

అధికారులు దగ్గరుండి మరి యూరియా టోకెళ్లను దళారులకు అప్పగించిన సంఘటన గురువారం చివ్వెంల మండలం వి కే పహాడ్ లో చోటుచేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం… వ్యవసాయ, సింగిల్ విండో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా గత మూడు రోజులుగా వట్టి ఖమ్మం పహాడ్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో యూరియా బస్తాల పంపిణీ కొనసాగుతుంది.

బుధవారం సాయంత్రం ఒక లోడ్ యూరియా రాగా కొంత మొత్తాన్ని రైతులకు ఇచ్చిన అధికారులు గురువారం ఉదయం నుండి అక్రమాలకు తెరలేపారు. ఇప్పటివరకు ఏడులోడ్ల యూరియాకి సంబంధించి టోకెన్లు పంపిణీ చేసిన ఏ ఈ ఓ ను కాదని మండల వ్యవసాయ అధికారి తనకు అనుకూలంగా ఉన్న ఏఈఓ ను తీసుకొచ్చి నేరుగా దళారులకు టోకెన్లు పంపిణీ చేశారు.

గురువారం పిఎసిఎస్ కార్యాలయం ముందు కుడకుడ క్లస్టర్ ఏ ఈ ఓ టోకెన్ లను పట్టుకొని తన వద్ద టోకెన్లు ఉన్నాయని ఏవో ఎవరికి ఇవ్వమంటే వారికి ఇస్తానని సుమారు 60,70 పైగా టోకెన్లు పంపిణీ చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో అక్కడికి వివిధ గ్రామాలకు చెందిన నాయకులు చేరుకోగా వారికి ఒక్కొక్కరికి పది బ్యాగులు చొప్పున టోకెన్ లు ఇచ్చారు.

అర్హులైన రైతులు ఒక యూరియా కట్ట టోకెన్ ఇవ్వమని ఎంత బతిలాడిన ఇవ్వకపోవును స్థానిక పోలీసులతో రైతులను అక్కడ నుంచి బయటకు వెళ్లగొట్టించారు.

మండలంలో యూరియా సక్రమంగా సరఫరా కాకపోవడానికి ఏవో, పిఎసిఎస్ సీఈవోలు కారణమని మొదటి నుంచి ఆరోపణలు వెలుబడుతున్న ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో గురువారం ఇద్దరూ అధికారుల సూచనల మేరకు చిరు ఉద్యోగులు టోకెన్ ల పంపిణీ అస్తవ్యస్తంగా చేశారు. ఇందులో భాగంగా వట్టి ఖమ్మం పహాడ్ పిఎసిఎస్ కార్యాలయంలో వరుసగా మూడో రోజు రైతులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

MOST READ : 

  1. Hyderabad : శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి తప్పిన ప్రమాదం..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!

  3. District collector : రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు..!

  4. Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..!

మరిన్ని వార్తలు