సూర్యాపేట : వాగులో గల్లంతయిన వ్యక్తి మృతదేహం లభ్యం

సూర్యాపేట : వాగులో గల్లంతయిన వ్యక్తి మృతదేహం లభ్యం

తుంగతుర్తి, ఆగస్టు 8 , మన సాక్షి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తున్న బంధం వాగును దాటే క్రమంలో వాగులో  అన్నారం గ్రామానికి చెందిన పిట్టల నారాయణ శనివారం సాయంత్రం గల్లంతయ్యాడు.

ALSO READ : రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

సోమవారం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు మృతదేహాన్ని వాగు లోగాలించి  వెలికితీశారు. వివరాల ప్రకారం నారాయణ శనివారం  గేదెలను మేపుకొని వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకొనిపోయాడు.  తాసిల్దార్ రాంప్రసాద్ ,ఎస్ఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో వాగులో వెతికిన గల్లంతైన నారాయణ కనపడకపోవడంతో చివరికి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు విజయవాడ నుండి రప్పించి వాగులో వెతికించగా మృత దేహాన్ని కనుగొన్నారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డానియల్ తెలిపారు.