వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా మిర్యాలగూడ

వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా మిర్యాలగూడ

బహుమతులు అందజేసిన బి.ఎల్.ఆర్

మిర్యాలగూడ, మనసాక్షి : బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతగా మిర్యాలగూడ నిలిచింది. ఈనెల 22 నుంచి స్థానిక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్స్ లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48 టీంలు ఆడటం జరిగింది. 24న జరిగిన ఫైనల్లో వీటిలో మొదటి విజేతకు (మిర్యాలగూడ జట్టు) రూ. 20 వేలు క్యాష్ ప్రైస్, కప్ ద్వితీయ విజేతగా, (హుజూర్నగర్ జట్టు) రూ. 15 వేల ప్రైజ్ మనీ, కప్, తృతీయ విజేతగా (బి ఎల్ ఆర్ బుల్లెట్స్) రూ. 12 వేల క్యాష్ ప్రైస్, కప్, చతుర్ద విజేతగా (దర్శించర్ల) రూ. 10 వేల క్యాష్ ప్రైస్, కప్ గెలుచుకోగా కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అందజేశారు.


ఈ కార్యక్రమానికి అతిధులుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి బెజం సాయి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి , లావూరి రవి నాయక్, క్రికెటర్ జానీ, గంధం రామకృష్ణ, ఆర్టీసీ డిపో మేనేజర్ పాల్, అడవిదేవులపల్లి సర్పంచ్ మర్రెడ్డి, పీఈటి లు వెంకటేశ్వర్లు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బి ఎల్ అర్ బ్రదర్స్ సేవా కార్యక్రమాలే కాకుండా యువతను ప్రోత్సహిస్తూ, యువత పెడదారి పట్టకుండా సమాజానికి ఆదర్శంగా ఉండాలనే సదుద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పూర్తి ఖర్చులను భరిస్తూ వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బిఎల్ఆర్ బ్రదర్స్ ఒక్క సేవా కార్యక్రమాల్లోనే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతంగా నిర్వహిస్తారని, అలాంటి నాయకుడు మన నియోజకవర్గంలో ఉండటం మన అదృష్టమని అన్నారు. అదే విధంగా వచ్చే సంవత్సరం రాష్ట్రస్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించేలా అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.