Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Vande Bharath : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలుపై కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం..!

Vande Bharath : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలుపై కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం..!

హైదరాబాద్ మనసాక్షి :

తిరుపతికి వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. తిరుపతి వెళ్లే వారికి మరింత సౌకర్యవంతంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి (20701), తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు(20702) అందుబాటులోకి వచ్చాయి .

.

సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం వేసవిలో సెలవులు కావడం వల్ల ఎక్కువమంది తిరుపతికి వెళుతున్నారు . దాంతో తిరుపతి వెళ్లే వారికి సౌకర్యవంతంగా వందే భారత్ రైలు కు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తుంది.

 

దాంతో ప్రస్తుతం వందే భారత్ రైలులో 7 ఏసీ బోగీలు ఒక ఎగ్జిక్యూటివ్ వేసి భోగి తో 8 ఉన్నాయి. వాటిని 16కు పెంచుతూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

సికింద్రాబాద్ – తిరుపతి :

సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరుతుంది. నల్గొండకు ఉదయం 7 .19 గంటలకు, గుంటూరుకు 9 .45 గంటలకు, ఒంగోలుకు 11.08 గంటలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12 .29 గంటలకు చేరుకుంటుంది. తిరుపతికి 2. 30 గంటలకు చేరుకుంటుంది .

 

తిరుపతి – సికింద్రాబాద్ :

తిరుపతి – సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ (20702) మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరుతుంది. 5. 20 గంటలకు నెల్లూరుకు, 6.30 గంటలకు ఒంగోలుకు, 7:45 గంటలకు గుంటూరుకు, రాత్రి 10 .10 గంటలకు నల్గొండ, రాత్రి 11. 45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

 

నాలుగు స్టేషన్ల లో స్టాప్ : 

సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కేవలం నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగనున్నది నల్గొండ , గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగనున్నది.

 

సికింద్రాబాద్ – తిరుపతి టికెట్ ధరలు ఇవి:

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి (20701), తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు(20702) అందుబాటులో ఉన్నాయి.

ట్రైన్ చార్జీల ధరలు ఈ విధంగా ఉన్నాయి :

సికింద్రాబాద్ – తిరుపతి రూ. 16 80 (చైర్ కార్ టికెట్)
సికింద్రాబాద్ – నెల్లూరు రూ. 1250
సికింద్రాబాద్ – ఒంగోలు రూ. 10 75
సికింద్రాబాద్ – గుంటూరు రూ. 865
సికింద్రాబాద్ – నల్గొండ రూ. 4 70

సికింద్రాబాద్ – తిరుపతి రూ. 3080 (ఎగ్జిక్యూటివ్ చైర్)

సికింద్రాబాద్ – నెల్లూరు
రూ. 2455
సికింద్రాబాద్- ఒంగోలు
రూ. 2045
సికింద్రాబాద్- గుంటూరు రూ.1620
సికింద్రాబాద్ – నల్గొండ రూ. 900

 

మరిన్ని వార్తలు