వీరకోలతో కొట్టుకున్న రాహుల్‌ గాంధీ 

వీరకోలతో కొట్టుకున్న రాహుల్‌ గాంధీ 

కంగ్టి (సంగారెడ్డి),  నవంబర్ 3, మన సాక్షి : సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధి భారత్‌ జోడోయాత్ర జోరుగా.. హుషారుగా సాగుతోంది. పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు, విద్యార్ధులు, యువకులు యువనేత వెంట యాత్రలో కలిసి నడుస్తున్నారు. పోతురాజుల నృత్యాలు, తెలంగాణ జానపద కళాకారుల ఆటాపాటల సందడి అంతాఇంత కాదు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కళాకారుల చేతిలో ఉన్న వీరకోలను తీసుకుని కొట్టుకుని ఉత్సాహపరిచారు.