Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!
Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎరువులు ఫర్టిలైజర్ దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన మందులు ఉన్నట్లుగా గుర్తించి యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం..
మిర్యాలగూడ మండలంలోని నందిపహాడ్, రవీంద్ర నగర్ లో నిర్వహిస్తున్న ఎరువుల పురుగుమందుల దుకాణాలు లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ మిర్యాలగూడ రైతు ఆగ్రో సేవా కేంద్రం రవీంద్ర నగర్ షాపులను మండల వ్యవసాయ అధికారి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది.
అందులో భాగంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్లు కొంతమంది రైతులను విచారణ జరిపారు. ఎరువుల దుకాణం వాళ్లు బలవంతంగా మందులను మందులను విక్రయిస్తున్నారా..? అని ఆరా తీసి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ పోయి తీసుకుంటాము కానీ మాకు ఎవరు బలవంతం చేయట్లేదు అని రైతులు తెలిపారు.
షాపు నందు తనిఖీ నిర్వహించి అందులో కొంత కాలం చెల్లింపు అయిపోయిన పురుగు మందులను గుర్తించారు. సుమారు వాటి విలువ 1,97,000 రూపాయలు. వాటిని సీజ్ చేసి పురుగు మందుల యాజమాన్యాలపై కేసు నమోదు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ సి ఐ ఎస్ కె గౌస్ , నరసింహ రెడ్డి , ఏఈఓ షఫీ మండల వ్యవసాయాధికారి దీనావత్ సైదా నాయక్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !
-
Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!
-
Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ హత్య కేసులో A2కు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు..!










