Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ వ్యాప్తంగా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం పంటల సీజన్ కూడా పూర్తి కావచ్చింది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా పథకం ను ప్రారంభించలేదు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా ఎకరానికి 15 వేల రూపాయలను పెట్టుబడి సహాయం అందజేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి పది మాసాలకు పైగా అయినప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసాను ప్రారంభించలేదు. కాగా గత యాసంగి సీజన్లో పాత పద్ధతిలోనే రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేశారు. వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకం తీసుకొచ్చి ఎకరానికి 15వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
కానీ గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నందున రైతు భరోసా పథకం అమలుపై రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. రైతుల అభిప్రాయం మేరకు నియమ, నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని జూన్, జూలై మాసంలోనే ప్రారంభించాల్సి ఉంది.
రైతులు పంటల సాగు చేసుకునేందుకు పెట్టుబడి సహాయంగా జూలై మాసంలో అందజేస్తారు. కానీ రైతుల రుణమాఫీ ప్రక్రియ తోపాటు రైతు భరోసా పై రైతుల అభిప్రాయ సేకరణ వల్ల జులై మాసంలోనే ప్రారంభించాల్సిన రైతు భరోసా పథకానికి ఆలస్యమైంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ పూర్తి కావచ్చింది.
అక్టోబర్ మాసంలో వరి కోతలు సైతం కోయనున్నారు. ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దాంతోపాటు సన్నధాన్యం కొనుగోలు చేసిన రైతులకు క్వింటా ఒక్కంటికి 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ రైతు భరోసా పథకం ఈ సీజన్లో ప్రారంభం కాలేదు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15000 రూపాయల పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది.
అందుకుగాను రెండు విడతలుగా 7500 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. కానీ రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయ్యాకనే రైతు భరోసా పథకాన్ని ఇవ్వనున్నట్లు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
రుణమాఫీ ప్రక్రియ ఇంకా ఎంతకాలం పడుతుందో అని రైతుల ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ పూర్తయ్యాక రైతు భరోసా అందిస్తే అప్పటికే వానాకాలం సీజన్ కూడా పూర్తికానున్నది. భరోసా కల్పిస్తారని రైతులు ఇంకా ఎదురుచూస్తున్నారు.
LATEST UPDATE :
-
PONGULETI : దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా, త్వరలో నూతన రెవెన్యూ చట్టం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
-
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలాఖరు లోపు వారికే ఇందిరమ్మ ఇండ్లు..!
-
బెంగళూరులోని గుహ నుంచి 188 ఏళ్ల వృద్ధుడిని రక్షించారా? నిజమేనా.. ప్రపంచ వ్యాప్తంగా వీడియో వైరల్..!
-
District collector : డిజిటల్ సర్వేలో ఒక్క ఇంటిని కూడా వదలొద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!










