TOP STORIESBreaking Newsజాతీయం

LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!

LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

ప్రస్తుతం ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువుగా వంట గ్యాస్ మారింది. అయితే ఈ వంట గ్యాస్ కొనుగోలు చేయడానికి సామాన్యులకు కష్టతరంగా మారింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తక్కువ ధరలకే వంటగ్యాస్ అందించడంతో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించనున్నది.

కేంద్ర ప్రభుత్వం 2016లో మే 1వ తేదీన ఉచిత వంట గ్యాస్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించడంతో పాటు వీరికి కేవలం 550 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కూడా చేస్తున్నారు. ఇలా ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీపై అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 12 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు.

ఎవరు అర్హులు

ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందడానికి మహిళలు మాత్రమే అర్హులు. అందుకు భారత పౌరురాలై ఉండాలి. 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. బిపిఎల్ కుటుంబం ఉండాలి. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్, అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులుగా ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల దృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దాంతో పాటు పాస్ ఫోటో సైజు ఫోటో ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఉజ్వల యోజన వెబ్ సైట్ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉజ్వల యోజన 2.0 కనెక్షన్ అనే ట్యాబ్ పై క్లిక్ చేసి ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా కనెక్షన్ పొందాలనుకుంటున్నారో.. ఆ కంపెనీ పేరును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఆ తర్వాత లాగిన్ కావాలి. రాష్ట్రం, జిల్లా పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంపిక చేసుకుని కేవైసీ పూర్తి చేయాలి. దాంతో పాటు రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు, బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత దరఖాస్తు ప్రింట్ తీసుకొని మీరు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీని కలిస్తే మీ గ్యాస్ సిలిండర్ కేటాయిస్తారు.

MOST READ 

  1. Vemulapally : పంచాయతీ ఎన్నికల్లో రావులపెంటలో బిఆర్ఎస్ హవా..!

  2. Local Body Elections : అమ్మా నన్ను ఓటు వేసి దీవించు.. కాళ్లు మొక్కి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి..!

  3. Banana : అరటిపండు ఆరోగ్యకరమే.. కానీ వారు తినకూడదు..!

  4. WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!

మరిన్ని వార్తలు