TOP STORIESBreaking Newsహైదరాబాద్

Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

డి మార్ట్ లో సరుకులుకుంటే తక్కువ ధరలకు వస్తాయని అందరూ భావిస్తారు. అక్కడ ఒకేసారి నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుంటారు. అయితే వాస్తవానికి డి మార్ట్ లో తక్కువ ధరలకే సరుకులు లభిస్తున్నప్పటికీ ఇంకా అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కొనుగోలు చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంది. అవేంటో తెలుసుకుందాం..

నెలకు సరిపడా ఒకేసారి :

కొంతమంది వారానికి సరిపడా సరుకులు తెచ్చుకుంటారు. తిరిగి మళ్లీ వారం రోజులకు వెళుతుంటారు. అలాంటి వారికి మార్ట్ లో రద్దీ తప్ప ఏమి ఉపయోగం ఉండదు. వీలైనంతవరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు షాపింగ్ చేయండి. నెలవారి సరుకులు ఒకేసారి కొనుగోలు చేయండి. దాంతో సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయి.

సాధారణ రోజుల్లో రాయితీ అధికం :

డిమార్ట్ కు వెళ్లాలనుకునే వారు వారాంతంలో ప్లాన్ చేసుకోకండి. సెలవు రోజులలో కూడా డిమార్ట్ కు వెళ్ళకండి. అప్పుడు ఎక్కువగా రద్దీగా ఉంటుంది. అయితే వస్తువులపై కూడా రాయితీ తక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో రాయితీ అధికంగా ఉంటుంది. దాంతో పాటు డిమార్ట్ లేబుల్ ఉన్న బ్రాండ్ల సరుకులు అనుకుంటే మీకు ఇంకా తక్కువ ధరకే లభిస్తాయి.

ఎలా కొంటే లాభం..?

డి మార్ట్ లో ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. సబ్బులు, డిటర్జెంట్లు తక్కువ మొత్తంలో కొనకండి. అవి ఎక్కువ మొత్తంలో కొంటే అదనంగా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిపైన 30 నుంచి 50% వరకు కూడా తగ్గింపు ఉంటుంది. ఎక్స్పైరీ తక్కువగా ఉన్న వాటికి ఎక్కువ శాతం తగ్గింపు ఉంటుంది. అలాంటివి తీసుకుని ఎక్స్పైరీ డేట్ లోపే వాడాలి.

సీజన్ లో ..

డీమార్ట్ లో పండగల సీజన్ లో కూడా భారీగా తగ్గింపులు ఉంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్ పండగల సీజన్ లో సరుకులకు ఆఫర్లు ఉంటాయి. అదే విధంగా పరిస్థితులను బట్టి వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలంలో కూడా తగ్గింపులు ఉంటాయి. వారానికోసారి ధరలు మారుతూ ఉంటాయి. వాటిపై అవగాహన పెంచుకొని సరైన సమయానికి వెళ్లి కొనుగోలు చేస్తే డబ్బులు ఆదా అవుతాయి.

ఆన్ లైన్ సెర్చ్..!

అదేవిధంగా డి మార్ట్ లో ఖరీదు చేసే వస్తువులకు ధర ఎంత తక్కువగా ఉంటుందనే విషయాన్ని ఆన్ లైన్ లో కూడా పోల్చుకొని చూడండి.

MOST READ :

  1. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  2. District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. ఆకస్మిక తనిఖీలు.. కీలక ఆదేశాలు జారీ..!

  4. Doctorate : తండ్రి స్వీపర్.. తనయుడికి డాక్టరేట్..!

  5. Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)

మరిన్ని వార్తలు