WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ప్రస్తుతం వాట్సప్ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. భారతదేశంలోనే 550 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ లో చాటింగ్, ఫొటోస్, వీడియోస్ ఈజీగా షేర్ చేసుకునే అవకాశం ఉంది.
కానీ తెలిసో.. తెలియకో.. చాటింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అందులో ముఖ్యమైన విషయాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు డిలీట్ అయిన చాటింగ్ కూడా చూడవచ్చును. ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు. సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
వాట్సప్ చాటింగ్ లో టిప్స్ ఇవి పాటిస్తే చాలు :
వాట్సప్ ఓపెన్ చేసి కుడి వైపున పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చాట్ క్లిక్ చేయాలి. చాట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతున్న పేజీని స్క్రోల్ చేసి చాట్ బ్యాకప్ అని ఆప్షన్ కనిపిస్తుంది. అయితే చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేసి.. బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్స్ తిరిగి పొందవచ్చును.
అయితే డిలీట్ అయిన చాట్ లను తిరిగి పొందే ముందు మీ ఫోన్ స్టోరేజీ ఉందో..? లేదో..? చూసుకోవాలి. గూగుల్ డిస్క్ లో తగినంత స్టోరేజ్ ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా వాట్సాప్ యూజర్లు తమ చాట్ లను గూగుల్ డ్రైవ్ కు బ్యాకప్ చేసుకోవచ్చును. అయితే ఐఫోన్ వినియోగదారులు బ్యాకప్ ల కోసం ఐ క్లౌడ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది.
MOST READ :
-
Holiday : రేపు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..?
-
Miryalaguda : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం.. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్ కు అనుసంధానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
-
Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!









