Talented : వాచ్ మెన్  కూతురు టాలెంట్… అభినందించిన మంత్రి గంగుల..!

Talented : వాచ్ మెన్  కూతురు టాలెంట్… అభినందించిన మంత్రి గంగుల..!

మంచిర్యాల, మన సాక్షి

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 468/470 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది పేదింటి విద్య కుసుమం
మంచిర్యాల పట్టణం జన్మభూమి నగర్ లో ఒక అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా పనిచేస్తున్న శ్రీరాముల వెంకటేష్-రాజేశ్వరి దంపతుల కూతురు హరిత. మందమర్రిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది.

 

ఈ మధ్యనే విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఎం.పీ.సీ గౄపులో 468/470 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. హరితను అభినందిస్తూ… బి.సి. వెల్ఫేర్ మంత్రి గంగుల కమలాకర్ ఈ నెల 10వ తేదీన సచివాలయానికి పిలిపించి సన్మానించడం జరిగింది.

 

ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన వేమనపల్లి మండలంలోని చామనపల్లి మా స్వగ్రామం. జీవనోపాధి కోసం మంచిర్యాలకు రావడం, మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. అలా మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులంలో సీటు సంపాదించి కష్టపడి చదువి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సచివాలయంలో మంత్రి గారి చేత సన్మానం జరగడం ఇక మా తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.

 

మరెన్నో పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి మా అమ్మానాన్నల కలలను సాకారం చేస్తను అన్న విద్య కుసుమం హరిత