తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లారాజకీయం

Minister Uttamkumar Reddy : బనకచర్లను అడ్డుకుంటాం..!

Minister Uttamkumar Reddy : బనకచర్లను అడ్డుకుంటాం..!

గోదావరిఖని, మన సాక్షి :

గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించు కునెలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

అంతర్గాం మండలంలోని గోలివాడ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుదిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహా హర కర వేణుగోపాల్ ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణా రావు లతో కలిసి ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యుల కృషి మేరకు రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు కోటీ పది లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు చేసి అంతర్గాం, ముర్మురు, బ్రాహ్మణ పల్లి ,ఎల్లంపల్లి సోమనపల్లి, మద్దిరాల , తొట్యాల పురం మొదలగు గ్రామాలకు, ‌ 17 ఎల్ ద్వారా కుక్కల గూడూరు, నిట్టూరు గ్రామాలకు మొత్తం 13 వేల పైగా ఎకరాలకు నీరు చేరుతుందని అన్నారు.

ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడంలో రవాణాశాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ కృషి ఎంతగానో ఉందని అన్నారు. స్వతంత్ర భారత దేశంలో మొదటిసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత సాధించడంలో మన ప్రభాకర్ కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి సైతం శ్రీధర్ బాబు సలహాలు సూచనలు తీసుకుంటారని చెప్పారు.

తెలంగాణ నీటి హక్కులను హరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుందని, గోదావరి పేపర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి సి.డబ్ల్యూ.సి వరకు ఫిర్యాదు చేసి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నామని మంత్రి తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం, నీటి హక్కులకు వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ చూస్తుందని, దీనిని అన్ని వేదికలలో, న్యాయ పరంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మంథని నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లాకు ఒక ఎకరాకు నీరు ఆందించలేదని అన్నారు.

సుప్రీంకోర్టు జస్టిస్ ఘోష్ అందించిన నివేదికను క్యాబినెట్ ముందు పెడ్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గత ప్రభుత్వం లక్ష కోట్లు వృథా చేసిందని అన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టు 38 వేల కోట్లతో నిర్మించి ఉంటే నేడు గోదావరి పరివాహక ప్రాంతంలో కరువు ఉండేది కాదని అన్నారు.

గత ప్రభుత్వం దోపిడి చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని తెలిపారు. 3 బ్యారేజీలు ఫౌండేషన్ బలహినంగా ఉందని, అక్కడ నీరు నిల్వ చేస్తే 44 ఊర్లు , భద్రాచలం కొట్టుకొని పోతాయని ఎన్.డి.ఎస్.ఏ రిపోర్ట్ అందించిందని అన్నారు. 3 బ్యారేజీల మరమ్మత్తు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

వ్యవసాయ శాఖ, నీటీ పారుదల ప్రాజెక్టు సమన్వయంతో 3 బ్యారేజీలు నిరూపయోగంగా ఉండగా గత సంవత్సరం రికార్డు స్థాయిలో 2 కోట్ల 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని అన్నారు. గోదావరి నది పై తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన 968 టిఎంసీల నీరు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని అన్నారు.గోదావరి నది పరివాహక ప్రాంతంలో మంథని రామగుండం, పెద్దపల్లి ఉన్నాయని, ఇక్కడ సాగు నీరు ఆందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజి నిర్మాణం పునః ప్రారంభం చేసి పూర్తి చేస్తామని అన్నారు. ఇచ్చంపల్లి వద్ద కూడా మరో ప్రాజెక్టు నిర్మిస్తామని అన్నారు. గత ప్రభుత్వం 10 వేల కోట్ల ఖర్చు పెట్టి రేషన్ ద్వారా 2.82 కోట్ల దోడ్డు బియ్యం సరఫరా చేసేదని, ఆ బియ్యం 80 శాతం అక్రమాలకు, రీసైక్లింగ్ కు ఉపయోగపడేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా 3 కోట్ల 17 లక్షల మంది నిరుపేదలకు 13 వేల కోట్ల ఖర్చు చేసి నెలకు 6 కిలోల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం అర్హులైన అందరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. 8 లక్షల 60 వేల నూతన రేషన్ కార్డుల జారీ చేశామని , రామగుండం ప్రాంతంలో అదనంగా 6500 నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా 85% జనాభా కు సన్న బియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నామని అన్నారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

MOST READ ; 

  1. Miryalaguda : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల ఎంపిక..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!

  4. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

మరిన్ని వార్తలు