మా హాస్టల్ మాకే కావాలి.. విద్యార్థుల ధర్నా..!
మా హాస్టల్ మాకే కావాలి.. విద్యార్థుల ధర్నా..!
వేములపల్లి , మన సాక్షి :
మా హాస్టల్ మాకే కావాలని హాస్టల్ విద్యార్థులు ధర్నా చేసిన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వేములపల్లి మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ ఉంది. సమీపంలోని మాడుగుల పల్లి కస్తూరిబా పాఠశాల విద్యార్థులను కూడా వేములపల్లి మండలం ఆదర్శ పాఠశాల హాస్టల్లో కలిపే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
దాంతో విద్యార్థుల సంఖ్య 350 నుంచి 400 వరకు పెరిగే అవకాశం ఉంది. కాగా సౌకర్యాలు సరిపోవు అంటూ మా హాస్టల్ మాకే కావాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
మా హాస్టల్ మాకే కావాలని హాస్టల్ గేటు వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మాకు వాటర్ , బాత్రూంలు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు అన్నారు.
ఇది కూడా చదవండి :
మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!
ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!
NALGONDA: నల్గొండ పోలీసుల స్పెషల్ డ్రైవ్..14 టీములతో నాకబంది..!









