పెండ్లి బృందం బస్సు బోల్తా..! 

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై శనివారం ఉదయం పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా మందిరం సమీపంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

పెండ్లి బృందం బస్సు బోల్తా..! 

చింతపల్లి, మనసాక్షి:

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై శనివారం ఉదయం పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా మందిరం సమీపంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

చింతపల్లి స్థానికులు,పోలీసులు తెలిపి వివరాల ప్రకారం హైదరాబాదు నుండి వినుకొండకు పెళ్లి బృందంతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు శుక్రవారం హైదరాబాదులోని బంధువుల పెళ్లికి వెళ్లి వస్తువు ఉదయం 6 గంటల సమయంలో చింతపల్లి మండల కేంద్రానికి సమీపంలో సాయిబాబా మందిర బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది.

ఈ బస్సులో సుమారు 40 మంది పెళ్లి బృందం సభ్యులు ప్రయాణిస్తున్నారు. అందులో చప్పడి భారతమ్మ 50 సంవత్సరాలు ఆమెకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హటావోటి నా సంఘటన స్థలానికి చేరికలు ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులో నుండి పెళ్లి బృందం సభ్యులను గాయాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక సహకారంతో హైదరాబాద్కు తరలించారు. పెళ్లి బంధం పూర్తి సమాచారం వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.