Godavarikani : జల్సాల కోసం అతడు ఏం చేసేదంటే.. షాక్ అవ్వాల్సిందే..!
Godavarikani : జల్సాల కోసం అతడు ఏం చేసేదంటే.. షాక్ అవ్వాల్సిందే..!
గోదావరిఖని, మన సాక్షి:
కార్లు కుదువ పెట్టుకుని మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
స్థానిక ఎల్బీనగర్ కు చెందిన ప్రణయ్ భాస్కర్ కారు డ్రైవర్ గా పని చేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు, చెడు అలవాట్లకు సరిపోక స్నేహితుల వద్ద డబ్బులు చే బదులు తీసుకోని వారు తిరిగి అడగగా తను కిరాయికి తీసుకొని వచ్చిన కార్లు, తెలిసిన వారి వద్ద నుండి కార్లను కిరాయికి నడిపిస్తాను నెల నెల కిరాయి ఇస్తా అని చెప్పి నమ్మిస్తాడు.
కొన్ని రోజులు కిరాయి ఇవ్వడం తరువాత కొద్ది రోజులకు జల్సాలకు అలవాటు పడిన ప్రణయ భాస్కర్ తను తెలిసిన వారి వద్ద కార్లు తనఖా పెట్టిన వారి దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు తీసుకొని జల్సాలు చేస్తూ కార్ యజమానులకి డబ్బులు ఇవ్వకుండా ఫోన్లో స్పందించకుండా హైదరాబాదులో తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ విధంగా సుమారు 10,00 000 లక్షల రూపాయల వరకు కార్లు కుదవ పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ. పోలీస్ తరుపున ప్రజలకు తెలపడం ఏమనగా ఎవ్వరు కూడా తమ అవసరాల కోసం వాహనాలు తనఖా పెట్టుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకువాలన్నారు.
వాహన పత్రాలు సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అదేవిదంగా డబ్బులు ఇచ్చే వారు కూడా వాహనాల అసలు యజమాని, వారి వివరాలు, పూర్తి పత్రాలు తప్పనిసరిగా చూడాలన్నారు. వాహనం కు సంబందించిన వారు కాకుండా వేరే వారు తనఖా పెడితే తీసుకోని డబ్బులు ఇవ్వడం వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది, చట్టరీత్యా నేరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నిందితున్ని పట్టుకొని కార్లు స్వాధీనం చేసుకోవడం కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, సదానందం, కానిస్టేబుల్ మధు రమేష్ లను ఏసీపీ అభినందించారు.
MOST READ :
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!









