Gold : బంగారంలో 24, 22 క్యారెట్స్ అంటే ఏంటి.. తేడా తెలుసా..!
Gold : బంగారంలో 24, 22 క్యారెట్స్ అంటే ఏంటి.. తేడా తెలుసా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఎంత పెరిగినా కొనుగోళ్లకు ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఎలా ఉన్నా.. భారతదేశంలో మాత్రం బంగారంకు భారీ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో మరింత ఎక్కువగా బంగారం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తారు. బంగారం రేటు పెరిగినా కొద్దీ కొనుగోలు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది.
ఇది ఇలా ఉండగా బంగారం స్వచ్ఛత గుర్తింపులో 24, 22 క్యారెట్స్ ఉంటాయి. ఈ క్యారెట్ అంటే చాలామందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం..
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO) ద్వారా హాల్ మార్క్ ఉంటుంది. 24 క్యారెట్స్ బంగారం అంటే 99.9% స్వచ్ఛమైనది. ఈ బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించుకోలేరు. 22 క్యారెట్స్ లోకి మార్చిన తర్వాతనే ఆభరణాలను తయారు చేస్తారు.
22 క్యారెట్స్ బంగారం అంటే ఇది 91% స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను శాతం కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. అయితే ఎక్కువ దుకాణాలలో 22 క్యారెట్స్ బంగారమే ఆభరణాల రూపంలో విక్రయిస్తారు.
MOST READ :
-
TG News : నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు..!
-
PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : నిన్న తగ్గింది.. మళ్లీ పెరిగింది.. నేడు బంగారం ధరలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు సీలింగ్.. మీరు అర్హులేనా, లేటెస్ట్ అప్డేట్..!
-
New Scheme : తెలంగాణ మహిళలకు అదిరిపోయే పథకం.. ప్రతి మహిళకు 10 లక్షలు.. వివరాలు ఇవే..!









