Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్స్.. ఎడిట్ అండ్ చాట్ లాక్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్స్.. ఎడిట్ అండ్ చాట్ లాక్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
వాట్సాప్ లో రోజురోజుకు కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. యూజర్లను మరింతగా వాట్సాప్ ఆకట్టుకుంటుంది. అందులో అదిరిపోయేలా రెండు ఫీచర్స్ ను కొత్తగా తీసుకువచ్చింది. వాటిలో ఒకటి చాట్ లాక్, మరొకటి సెంట్ మెసేజ్ లకు ఎడిట్ ఆప్షన్.
చాట్ లాక్ :
దీని ద్వారా యాప్ లోనే ఒక్కో చాట్ కు లాక్ పెట్టుకోవచ్చు . పాస్ వర్డ్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ లాక్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ చాట్ లాక్ ఆప్షన్ ద్వారా లాక్ చేసిన కాంటాక్ట్ లు లేదా గ్రూప్ లు లాక్ ఫోల్డర్ లోకి వెళ్తాయి.
ఆయా కాంట్రాక్టులు, గ్రూపుల నుంచి మెసేజ్ లు వస్తే నోటిఫికేషన్లు కూడా రావు. అవి నేరుగా ఇన్ బాక్స్ లోకి చేరిపోతాయి. పాస్ వర్డ్ తో ఆ చాట్ ను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే కొత్తగా వచ్చిన మెసేజ్ లు కనిపిస్తాయి. ఈ విధంగా లాక్ చేసిన చాట్ లకు… ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో పాటు ఆ చాట్ ను బ్యాక్ ఆఫ్ తీసుకుని వీలుంది.
ఎడిట్ ఆప్షన్:
యూజర్లకు పంపించిన మెసేజ్ లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత చాటింగ్, వాట్సాప్ గ్రూప్ లలో యూజర్లు ఇతరులకు మెసేజ్ చేసినప్పుడు వాటిలో ఏదైనా పొరపాటు ఉన్నా… తిరిగి మెసేజ్ యాడ్ చేయాల్సి ఉన్నా… ఎడిట్ చేసే అవకాశం ఉంది.
మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాలలో ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకునే అవకాశం ఉండేలా ఈ ఫీచర్ ఉండనుంది. వాట్సాప్ బీటా వర్షన్ లో ఈ ఆప్షన్ టెస్టింగ్ లో ప్రస్తుతం ఉంది. టెక్స్ ట్ మెసేజ్లను మాత్రమే ఎడిట్ చేయవచ్చు .