Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!
Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. మాయ మాటలు చెప్పి ఎకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. లక్కీ డ్రాల పేరుతో ఆఫర్స్ వస్తున్నాయి. బ్యాంకు లోన్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫోన్ కాల్స్ లో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం, పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు.
ఈమధ్య ఫోన్ కాల్స్ లోను ప్రజలకు జాగ్రత్త చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికి ఫోన్ చేసినా ముందుగా ఓ లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ మనకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ప్రతిసారి ఫోన్ చేయగానే ఇదే వాయిస్ వినిపించడం కొంతమంది తిట్టుకునే వారు కూడా ఉంటున్నారు. అయితే ఇంతకు ఆ వాయిస్ ఎవరిదో తెలుసా..?
ఆమె వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. ఎవరంటే ప్రతిరోజు తన వాయిస్ తో ఎంతో మందిని అలరిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆమె పేరు అమృత. రేడియోమిర్చిలో జాకీగా పనిచేస్తుంది. ఇక ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అది వైరల్ గా మారింది. సోషల్ మీడియా లేదా.. తెలియని గ్రూపుల నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోండి.
అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఫ్రెండ్స్ నా వాయిస్ నేనే ఇరిటేట్ అవుతున్నాను. మొన్నటి వరకు మా అమ్మ నాన్న కూడా ఇది మా అమ్మాయి వాయిస్ అని సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఏంటి ఈ గోల మాకు అంటున్నారు. కానీ ఏం చేస్తాం నా చేతిలో ఏం లేదు. అంటూ ఫన్నీ వీడియోని షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
MOST READ :
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
-
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఏంతంటే..!
-
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
-
TGSRTC : శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..!









