Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : ఎస్పిఆర్ పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
Miryalaguda : ఎస్పిఆర్ పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
మిర్యాలగూడ, నవంబర్ 30, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ పి ఆర్ పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠ్యాంశాలు బోధించారు. అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు.
అనంతరం ఉత్తమ ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ యామిని వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జోన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల అయ్యన్న, ప్రైమరీ ఇంచార్జ్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









