TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : రైస్ మిల్లులో ధాన్యం విక్రయిస్తే బోనస్ వస్తుందా.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ స్పష్టం..!

Miryalaguda : రైస్ మిల్లులో ధాన్యం విక్రయిస్తే బోనస్ వస్తుందా.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ స్పష్టం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కాగా ప్రభుత్వం సన్నధాన్యంకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రైతులకు ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సన్నధాన్యం విక్రయాలపై బోనస్ అందజేసే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డ్ నందు నూతన ధాన్యం కొనుగోలు కేంద్రం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎవ్వరూ కూడా అస్యత ప్రచారాలు నమ్మవద్దు, అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే నిబంధనలు ప్రకారం ధాన్యం తీసుకువచ్చి ప్రతీ రైతు మద్దతు ధర పొందవచ్చు అని అన్నారు . అలాగే సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తాం , ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయిచర్ ధాన్యానికి రూ.2320 ధర తో కలిపి 500 రూపాయల బోనస్ కలిపి రూ.2830 ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.

కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందని అన్నారు. రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతిఒక్క రైతుకు తెలియజేస్తున్నామని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగులు పై సీఎం, మంత్రులు నిత్యం సమీక్ష చేస్తున్నారన్నారు.
చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు