Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో గొడవలు సర్వసాధారణంగా మారాయి. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న తర్వాత గొడవల వ్యవహారం రోజురోజుకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి హైదరాబాదులోని ఉప్పల్లో శుక్రవారం చోటు చేసుకుంది. తాను బస్సు ఎక్కేందుకు ప్రయత్నించినా ఆపకుండా వెళ్లిపోయారని ఓ మహిళ 10 కిలోమీటర్లు చేజ్ చేసి బస్సు ఆపిన సంఘటన చోటుచేసుకుంది.
ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద ఆమె బస్సు ఆపేందుకు ప్రయత్నించినా బస్సు ఆపకపోవడంతో ఆమె 10 కిలోమీటర్లు చేసి బస్సు డ్రైవర్ కండక్టర్ తో వాగ్వాదానికి దిగింది. తాను, తన పిల్లలతో కలిసి బస్సు ఎక్కి ఎందుకు వచ్చానని, దిగేవాళ్లు దిగుతుండగానే కొందరు బస్సు ఎక్కగానే బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడంటూ వాగ్వాదం చేసింది.
తాను బస్సు ఎక్కగానే తన పిల్లలు బస్సు ఎక్కేలోపే బస్సు వెళ్ళిపోతుందని, పిల్లల కోసం బస్సు ఆపమని చెప్పినా ఆగకుండా వెళ్లిపోవడంతో ఆమె దిగే క్రమంలో కింద పడినట్లు పేర్కొన్నది. అయినా కూడా బస్సు ఆపకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే కండక్టర్ మాట్లాడుతూ బస్సు కదిలిన తర్వాత ఆమె కిందికి దిగే ప్రయత్నం చేయడంతో కింద పడిందని, అదృష్టవశాత్తు బాగుంది ఏమి కాలేదని పేర్కొంటుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో చూడండి
ఉప్పల్ ఎక్స్ రోడ్డు దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సును ఆపని డ్రైవర్
రన్నింగ్ బస్సు ఎక్కి కిందపడ్డ మహిళ
కిందపడ్డ మహిళను తిట్టిన డ్రైవర్.. 10 కిలోమీటర్లు బస్సును చేజ్ చేసి డ్రైవర్, కండక్టర్‌తో మహిళ వాగ్వాదం pic.twitter.com/ADqm6aGinq
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025
Viral videos :
-
Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
-
Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
-
Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
-
Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)
-
Video viral : ప్రేమించి పెళ్లి చేసుకుంది.. మరో యువకుడితో.. భర్త ఏం చేశాడంటే.. (వీడియో)









