తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం.. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్ కు అనుసంధానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

Miryalaguda : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం.. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్ కు అనుసంధానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

దామరచర్ల, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వీర్ల పాలెం వద్దనున్న యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ లోని 2 వ యూనిట్ ను రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ విద్యుత్ ప్లాంటును జాతికి అంకితం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా వై టి పి ఎస్ 2 వ యూనిట్ ప్రారంభించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

శనివారం సాయంత్రం 4.20 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా వై టి పి ఎస్ చేరుకున్న సి ఎం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా పవర్ ప్లాంట్ పైలాన్ చేరుకొని ఆవిష్కరించి యూనిట్ 2 ద్వారా విద్యత్ ఉత్పత్తిని ప్రారంభించి 800 మెగా వాట్ల విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు.

తిరిగి కాన్వాయ్ ద్వారా హెలిఫ్యాడ్ కు చేరుకొని 5 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా నల్గొండకు వెళ్లిపోయారు. పవర్ ప్లాంట్ లో 40 నిమిషాలు గడిపి ప్లాంట్ కు సంబంధించి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ముఖ్య మంత్రి వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, టీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ , సీఈ సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు