తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల ఆందోళన..!

Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల ఆందోళన..!

దామరచర్ల, మన సాక్షి :

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం మోదుగుల కుంట తండా, కపుర తండా గ్రామస్తులు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల  ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకి వెళితే ఆర్ అండ్ ఆర్ సెంటర్ కింద 2020/2021లో 180 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు విడుదల కాగా కాంట్రాక్టర్ కు అగ్రిమెంట్ రాసి ఇచ్చారని వారు వాపోయారు. గ్రామ ప్రజలను మోసం చేసి డబుల్ బెడ్ రూమ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న అతను వాటి నిర్మాణాలపై అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

మొత్తం విడుదల అయిన ఇండ్లు 180, ప్రస్తుతం పూర్తయిన ఇండ్లు 101అయితే ఒక్కొక్క ఇంటి లబ్ధిదారుల నుంచి అక్రమంగా 5500 రూపాయలను సదరు కాంట్రాక్టర్ వారి నుండి వసూలు చేసినట్లు తెలిపారు.

ఒక్కొక్క లబ్ది దారునికి రావలసిన మొత్తం ఐదు లక్షల నాలుగు వేలు అయితే కొంతమంది లబ్దిదారులకు ఒక్కొకరికి నాలుగు లక్షలు ఇచ్చి మిగతా మొత్తం తన దగ్గరే ఉంచుకున్నాడని రావలసిన మొత్తం డబ్బులను అడిగితే వారిపై దాడికి తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు.

గతంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తాహసిల్దార్ తదితర అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

MOST READ : 

  1. Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)

  2. Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  4. Miryalaguda : ఫామ్ హౌస్ లో కేసీఆర్.. బోట్ క్లబ్ లో భాస్కరరావు.. కాంగ్రెస్ నాయకుల తీవ్ర ఆరోపణలు..!

మరిన్ని వార్తలు