యాదాద్రి సన్నిధిలో ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు

యాదాద్రిని సందర్శించిన ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు

యాదాద్రి భువనగిరి, మన సాక్షి :

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు మంగళవారం సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో పాటు సిపిఐ జాతీయ నాయకులు రాజా సందర్శించారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. రెండు హెలికాప్టర్లలో యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రులు,
ముఖ్య నేతలు చేరుకున్నారు. హైదరాబాదు నుండి యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రులు హెలీ యాడ్ ద్వారా తొలత ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు :

అక్కడి నుంచి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య నేతలకు ఆలయ, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కుంకుమ బొట్టు పెట్టి స్వాగతించారు. ఆలయ అర్చకులు , వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

 

పునర్నిర్మాణం గురించి వివరించిన కేసీఆర్

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నానంతరం ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కాగా అనంతరం ఆలయ ఫోటోలను, నిర్మాణ విషయాలను ముఖ్య నేతలకు కేసీఆర్ వివరించారు. ఆలయ నిర్మాణం చేపట్టిన విధానాన్ని వారికి వివరించారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా లు రెసిడెన్షియల్ సూట్ నుండి లక్ష్మీనరసింహస్వామి ఆలయం , టెంపుల్ సిటీని పరిశీలించి హెల్ప్యాడ్ వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి , జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓ ఎస్ డి ప్రియాంక, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సద్పతి , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, దేవాలయ జీవో గీతారెడ్డి, వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, సిపి దేవేందర్ సింగ్ చౌహన్, ఆర్డీవో భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెండు హెలికాప్టర్లలో ఖమ్మం బయలుదేరి వెళ్లారు.