తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చు.. నిరంతర ప్రక్రియ.. జిల్లా కలెక్టర్..!

District collector : మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చు.. నిరంతర ప్రక్రియ.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుంచి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులందరికీ వర్తిస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇదో నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం పర్నికా రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏడో వార్డు అశోక్ నగర్ లో ప్రజా ప్రభుత్వ ప్రజాపాలన వార్డు సభను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మందుగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా అమలు చేసే నాలుగు పథకాల కోసం తహసిల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాాలలో పేపర్, డెస్క్ వర్క్ పూర్తి చేసి వార్డు, గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

2024 సంవత్సరంలో నిర్వహించిన వార్డు / గ్రామ సభలలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, ఆయా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించడం జరిగిందని ఈ 26 నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కొత్త పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేయని వారు మున్సిపల్ వార్డులు/ గ్రామాలలో నాలుగు రోజులపాటు నిర్వహించే వార్డు/ గ్రామ సభలలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

తహసిల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన కేంద్రాలలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని ఆమె తెలిపారు. సొంత స్థలాలు ఉన్న వారితోపాటు, స్థలాలు లేని వారినీ సర్వే చేసి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఫోటోలు తీసుకున్న తర్వాత పరిశీలించడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు వర్తిస్తుందని, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని భూభారతి రికార్డుల ప్రకారం ఇస్తారన్నారు.

పాత దరఖాస్తులను కూడా ఎమ్మెల్యే కు అందజేయవచ్చని, ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. 7 వ వార్డు పరిధిలో పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ సునీత ను కలెక్టర్ ఆదేశించారు. వార్డు కౌన్సిలర్ సలీం కోరినట్టు పార్కులో మహిళలకు సందర్శన వేళలను ప్రత్యేకంగా కేటాయించాలని కలెక్టర్ సూచించారు.

సభలో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మాట్లాడుతూ.. ఏడో వార్డు అంటే తనకు ప్రేమ ఎక్కువ అని, ఈ వార్డు ప్రజలు కూడా తన పట్ల అంతే ప్రేమ చూపారన్నారు. జాబితాలో పేరు లేకపోయినా ప్రజా పాలన కౌంటర్లలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఇదో నిరంతర ప్రక్రియ అన్నారామె. ఐదేళ్లలో అందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబడతాయన్నారు. కొన్నేళ్ళ నుంచి కుటుంబాల సంఖ్య పెరిగినా.. కొత్త కార్డులు గత ప్రభుత్వాలు ఇవ్వలేదని, అలాంటి వారందరూ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు. వార్డు సభలంటే సాధారణంగా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ జనం రారని, కానీ ఏడో వార్డు ప్రజలు సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

వార్డులో లబ్ధిదారులు చాలా మంది ఉన్నారనీ, ఎక్కువగా రేషన్ కార్డులు, ఇళ్ల కోసమే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. చివరగా వార్డ్ కౌన్సిలర్ సలీం కాలనీలో గల ఎల్.ఐ.జీ క్వార్టర్లలో ఎన్నో ఏళ్లుగా ఉన్నవాళ్లకు పట్టాలు ఇవ్వాలని, వార్డులో సొంత అంగన్వాడి భవనాన్ని నిర్మించాలని కలెక్టర్, ఎమ్మెల్యే ను కోరారు. అంతకు ముందు ఆ వార్డు కమ్యూనిటీ హాల్ కు అవసమైన ఫర్నిచర్ కోసం ఎమ్మెల్యే తన సొంత నిధులను కేటాయించగా ఆ నిధులతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ ను, కమ్యూనిటీ హాల్ ను కౌన్సిలర్ ససలీమ్ తో కలిసి వారు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోనంగేరి హనుమంతు, మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ, మున్సిపల్ కమిషనర్ సునీత, వాడు కౌన్సిలర్ సలీం ఆయా వార్డుల ఆఫీసర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..! 

  2. Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  4. TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

  5. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

మరిన్ని వార్తలు