తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..!

కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..!

నకిలీ పత్తి విత్తనాల వ్యాపారంపై ఉక్కుపాదం.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

నారాయణపేట టౌన్, మనసాక్షి:

నారాయణపేట జిల్లాలో రైతు లను మోసం చేస్తూ నకిలీ ఎచ్ టి పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు.సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పత్రిక సమావేశం నిర్వహించి, జిల్లాలో పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల వివరాలను వెల్లడించారు.

ఈ నెల 25 న సాయంత్రం నారా యణపేట మండలం బండ గొండ, కొత్తపల్లి మండలం భూనీడు గ్రామలలో జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందం వ్యవసాయ శాఖ సంయు క్తంగా నిర్వహించిన దాడుల్లో, సుమారు రూ.1 కోటి విలువైన 10 టన్నుల నకిలీ ఎచ్ టి పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కొత్తపల్లి మండలం భూనీడు కి చెందిన వి. బాలకృష్ణ నాయుడు ఎ 1 ముద్దాయి అని, నారాయ ణపేట మండలం బండగొండ కు చెందిన ఎ2: శశివర్ధన్ నాయుడు అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, మద్దూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు చొప్పున మొత్తం రెండు కేసులు నమోదు చేయబడినట్లు ఎస్పీ తెలిపారు.

విచారణలో, నిందితులు నకిలీ ఎచ్ టి పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేసి, నారాయణపేట జిల్లాలో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు పొందుతున్నట్లు తేలిందన్నారు. ఎ1 నిందితుడు గతంలో మద్దూరు, నర్వ, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడి నట్లు తేలిందన్నారు. ఆ కేసులన్నీ ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయనీ తెలిపారు.

వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతు లను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారంలో ఎవరైనా పాల్గొంటే, రవాణా చేసినా, సరఫరా చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా, వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ప్యాకింగ్ లేని లేదా అనుమానాస్పద విత్తనాలను కొనుగోలు చేయవద్దని, నకిలీ విత్తనాల వ్యాపారం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా వ్యవసా య శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యవ సాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ ఇప్పుడు పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు సుమారు మూడు మండలాల్లో పంటలు వేయడానికి సరిపడే పరిమాణంలో ఉన్నాయని తెలిపా రు. రైతులు గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులలోనే విత్త నాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, లాట్ నెంబర్ ఉన్న విత్తనాలనే కొనాలని సూచించారు.

ఎక్కడైనా అక్రమంగా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు, డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్ష ణలో సమర్థవంతంగా పనిచేసిన నారాయణపేట , కోస్గి సీఐలు, శివశంకర్, సైదులు, నారాయణపేట రూరల్, మద్దూరు ఎస్ఐలు విజయ్ కుమార్, రాముడు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషో త్తం, ప్రత్యేక పోలీసు బృందం, వ్యవసాయ శాఖ అధికారుల ను జిల్లా ఎస్పీ వినీత్ అభినందించారు.

MOST READ 

  1. Groundnuts : వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.. రైతులను సన్మానించిన మార్కెట్ కమిటీ..!

  2. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

  3. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

  4. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

మరిన్ని వార్తలు