Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Suicide : మొన్న భార్య.. నేడు ఎస్ఐ ఆత్మహత్య..!

కరీంనగర్ జిల్లా టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అత్తగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఆయన భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకుంది.

Suicide : మొన్న భార్య.. నేడు ఎస్ఐ ఆత్మహత్య..!

మన సాక్షి, కరీంనగర్ :

కరీంనగర్ జిల్లా టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అత్తగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఆయన భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియల అనంతరం భార్య స్వగ్రామమైన సీతంపేటలోని అత్తగారింటికి ఎస్సై చంద్రశేఖర్ వెళ్లాడు. భార్య మృతితో మనస్థాపానికి గురైన చంద్రశేఖర్ అత్తగారింట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఐదు రోజుల క్రితం దివ్య ఆత్మహత్య :

కరీంనగర్ లోని హనుమాన్ పేటలో నివాసం ఉంటున్న ఎస్ఐ చంద్రశేఖర్ కుటుంబం.. అతని భార్య అయిదు రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెని హైదరాబాదుకు తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దివ్య కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

కాగా అదే రోజు దివ్య తల్లి గారి ఊరైన సీతంపేటకు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో దివ్య భర్త చంద్రశేఖర్ వల్లనే ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చంద్రశేఖర్ ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. దాంతో సమస్య సద్దుమరిగింది.

శనివారం దివ్య చనిపోయి ఐదో రోజు కార్యక్రమం నిర్వహిస్తుండగా ఎస్ఐ చంద్రశేఖర్ సీతంపేటకు చేరుకున్నారు. మనస్థాపానికి గురైన ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఆ దంపతులకు ఇద్దరు ఏడేళ్ల లోపు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో వారిద్దరూ అనాధలు అయ్యారు.

MOST READ 

మరిన్ని వార్తలు