Nalgonda : 11 మంది ఏ.యస్.ఐ లకు, యస్.ఐ లుగా పదోన్నతి..!
Nalgonda : 11 మంది ఏ.యస్.ఐ లకు, యస్.ఐ లుగా పదోన్నతి..!
నల్గొండ, మన సాక్షి :
పదోన్నతి పొందిన యస్.ఐ లకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు.
బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 11 మంది ఏ.యస్.ఐలకు, యస్.ఐ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా జిల్లా ఎస్పీ స్టార్ లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పని చేయాలి అన్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యల అడిగి తెలుసుకొని బాధితులకు సరిఅయిన న్యాయం జరిగే విదంగా పనిచేయాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని, దానిని పెంపొందే దిశగా పనిచేసి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా సిబ్బంది మొత్తం సస్పెన్షన్..!
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదిరిపోయే మరో గుడ్ న్యూస్..!
-
Transaction : రూ.20 వేలకు మించి లావాదేవీలు చేస్తే.. ఫైన్ కట్టాల్సిందే.. బిగ్ అలర్ట్..!
-
WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!









