Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం
Miryalaguda : మిర్యాలగూడలో రెండవ రోజు 176 నామినేషన్లు..!
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండవ రోజు 176 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

Miryalaguda : మిర్యాలగూడలో రెండవ రోజు 176 నామినేషన్లు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండవ రోజు 176 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి రోజు కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా రెండవ రోజు గురువారం 176 నామినేషన్లు వేశారు.
మొత్తం ఇప్పటి వరకు 180 నామినేషన్లు వచ్చాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 79 నామినేషన్లు వేయగా బీఆర్ఎస్ అభ్యర్థులు 67 నామినేషన్లు వేశారు. బిజెపి 13, సిపిఎం 5, ఇతర పార్టీల వారు ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు 11 మంది నామినేషన్లు వేశారు.









