1962 : సమ్మెకు సిద్ధమైన 1962 సిబ్బంది.. నిలిచిపోనున్న పశు సంచార వాహన సేవలు..!

1962 : సమ్మెకు సిద్ధమైన 1962 సిబ్బంది.. నిలిచిపోనున్న పశు సంచార వాహన సేవలు..!
మన సాక్షి, కొండమల్లేపల్లి :
1962 సిబ్బంది.. మూగజీవాల సేవలో ముందుంటారు. కానీ వారు అందిస్తున్న సేవలు పై ప్రభుత్వం మాత్రం శీతకన్నా చూపిస్తుందని 1962 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 1962 పశు సంచార వాహన సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో మూగజీవాలు ప్రాణాలు నిలుపుతున్న సిబ్బందికి మాత్రం చాలా చాలని జీతాలతో అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియక అర్ధాకలి తో అలమడిస్తున్నారు.
ప్రభుత్వ సిబ్బంది జీతాల నిధులను విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణ రోజురోజుకు భారంగా మారుతుందని సిబ్బంది వాపోతున్నారు ప్రజా ప్రభుత్వం లోనైన తమ బతుకులు మారుతాయని ఆశలు పెట్టుకున్న సిబ్బందికి నిరాశ మిగిలింది.
ఇంకా చేసేది ఏమీ లేక నమ్మే సైరన్ మోగించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న సుమారు 100 వాహనాలు సేవలు నిలిచిపోనున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గకి ఒక వాహనం చొప్పున 100 వాహనాల సేవలందిస్తున్నాయి.
1962 సంచార సేవలు పశు వైద్యులు పారామెడికల్, సహాయకులు,డ్రైవర్లు,సేవలందిస్తుండగా సిబ్బందికి గత కొన్ని నెలలుగా జీతాలు లేక ఆర్థిక భారం కొట్టుమిట్టాలాడుతుంది . క్షేత్రస్థాయిలో మూగజీవాలకు సేవలందిస్తున్న ప్రజల నుండి అభినందన తప్ప ప్రభుత్వం నుండి నిధులు లేక సిబ్బంది వేతనాలు మాత్రం అందడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 1962 మూగజీవాల సేవలను ప్రతిష్టంగా అమలుపరిచి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి సిబ్బందిని ఆదుకోవాలని కోరారు. గతంలో మెరుపు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వ నిధులు విడుదల చేసింది.
ప్రజా ప్రభుత్వం మీద నమ్మకంతో సిబ్బంది కుటుంబ పోషణ భారం అవుతుంది సేవలు మాత్రం నిబంధతతో చేస్తున్నారని ప్రభుత్వ స్పందించి తక్షణమే నిధులు విడుదల చేయాలని లేదంటే ఫిబ్రవరి 01 నుండి సమ్మెకు దిగుతామని ప్రభుత్వం హెచ్చరించారు.
MOST READ :
-
Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
Miryalaguda : సక్రమంగా లేని ఉపాధి హామీ రికార్డులు.. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా..!
-
Elections : పంచాయతీరాజ్ శాఖ పై సీఎం రేవంత్ సమీక్ష.. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..!









