తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి..!

Miryalaguda : వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
మంగళ వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మిర్యాలగూడ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలు, పట్టణంలోని వార్డులు విద్యుత్ కొరత లేకుండా ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు గాని, లో వోల్టేజ్ ఉన్న దగ్గర ట్రాన్స్ఫార్మర్ తెప్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో కరెంట్ షాక్ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు 24 గంటలు విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ రీతిగా ప్రతి ఒక్క అధికారులు సిబ్బంది పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస సుదీర్ కుమార్, ఏ ఈ లు ,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : 

మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!

సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!

Miryalaguda : మిర్యాలగూడ సిఐ సుధాకర్ పై వేటు..!

Job Mela : టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఆగస్టు 21న జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు