SURYAPET : కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.. తమ్మినేని వీరభద్రం..!
SURYAPET : కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.. తమ్మినేని వీరభద్రం..!
సూర్యాపేట, మనసాక్షి:
కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మరతత్వ బిజెపి నాయకత్వంలో ని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పోరేట్ అనుకూల, మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంఘాల జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చిందన్నారు. కార్మిక వర్గం అనేక పోరాటాల ఫలితంగా లేబర్ కోడ్ లు అమలుకు ఆలస్యం అయినా ప్రస్తుతం వాటిని అమలు చేసి కార్మిక వర్గం హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
2025 _26 బడ్జెట్ లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందన్నారు. సామాన్యులపై బారాలు మోపి, కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడుదారులకు ఐదు వేల కోట్లు రాయితీ ప్రకటించింది అన్నారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోలేదన్నారు.
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కార్మిక వర్గం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర చట్టం చేయాలన్నారు. ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
ఢిల్లీలో రైతులు పోరాటం చేసిన సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదన్నారు. కనీస మద్దతు ధర చట్టం చేయాలన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తుందని అన్నారు.
వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వ్యవసాయ కార్మికుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదన్నారు. వలసల నివారణ కోసం వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 నేటికీ అమలు కాలేదు అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టపరిచి 16 రకాల నిత్యవసర వస్తువులను పేదలందరికీ అందించాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై ఆంక్షలు విధిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నారని అన్నారు. ట్రంపు చర్యల మూలంగా భారతదేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఆంక్షలు కు భారత్ తలొగటం దురదృష్టకరమన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ జిల్లా సదస్సులో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా నాయకులు కో లిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు,
మట్టి పెళ్లి సైదులు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,
ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు జె నరసింహారావు, వీరబోయిన రవి, ఎల్గూరి గోవింద్, మడ్డి అంజిబాబు, మద్దెల జ్యోతి, శీలం శ్రీను, షేక్ జహంగీర్, ధనియాకుల శ్రీకాంత్, ఉప్పుల రమేష్ బోయిల్ల నవీన్ తో పాటు వివిధ మండలాల నుంచి కార్మికులు పాల్గొన్నారు.
MOST READ :
-
Penpahad : జిల్లా వైద్యాధికారి కీలక ఆదేశాలు.. పిహెచ్సి ఆకస్మిక తనిఖీ..!
-
Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!
-
Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!
-
Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!
-
Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!









