వరద బాధితులకు 5 సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలి

తప్పకుండా ఇంటి జాగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మార్వో

వరద బాధితులకు 5 సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలి

తప్పకుండా ఇంటి జాగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మార్వో

చర్ల, మనసాక్షి:

చర్ల మండల కేంద్రంలో గోదావరి పరవాక ప్రాంతంలోని ప్రజలకు చర్ల మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని వరద బాధిత పోరాట సంఘం ఆధ్వర్యంలో ముంపు బాధితులు ఎమ్మార్వో కార్యాలయాన్ని గురువారం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ..

 

చర్ల మండలంలో ప్రతి ఏటా వేలాది కుటుంబాలు గోదావరి ఉధృతికి బలి అవుతున్నారని అన్నారు. యంతో కస్టపడి ప్రేమతో కట్టుకున్న ఇల్లు మునిగిపోతున్నాయని కొన్ని ఇల్లు, అందులోని విలువైన వస్తువులు వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయని అన్నారు.

 

పంటలు మునిగిపోయి నాశనం అవుతున్నాయని హోరున ప్రవహించే గోదావరిలో పసికందులను వయసుమళ్ళిన పెద్దవారిని తీసుకొని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అధికారుల సహాయంతో పడవల్లో ప్రయాణించి పునరావాస కేంద్రాలకు వలసలకు వెల్లి ప్రాణాలను కాపాడుకోవలసిన దుస్థితి యార్పడుతుందని అన్నారు.

 

ఇది ప్రతీ యాట జరుగుతున్న తంతే కానీ ఇప్పుడు ఇది మరింత ప్రమాదంగా తయారయ్యిందని ఇటీవిల కాలంలో ప్రభుత్వాలు చేపడుతున్న పోలవరం ,సీతమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా ఉత్పన్నం అవుతున్న బ్యాక్ వాటర్ ఈ ప్రమాదాన్ని మరింత పెంచిందని దానివల్ల ఎన్నడూలేని విధంగా గోదావరి వరద ఉదృతి పెరిగిందని ప్రస్తుతం వర్షాకాలం వచ్చిందంటే మేము భయంభయంగా బ్రతకవలసిన పరిస్థితి యార్పడుతుందని అన్నారు.

 

 

ప్రతీ ఏటా పునరావాస కేంద్రాలకు మమ్ములను తరలించడంలో మాప్రాణాలను కాపాడటంలో సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం, అధికార యంత్రoగం, ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు సేవాద్రుక్పధులు , సంస్థలు ఇతరులు యంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఆ సహకారాన్ని మేము ఎన్నటికీ మరచిపోలేము అందుకు అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.

 

కానీ అది ఎప్పటికి శాశ్వత పరిస్కారం కాదని అది కేవలం తాత్కాలిక సహకారంగానే మేము భావిస్తున్నామని ప్రభుత్వం వారికి అధికారులకు మేము విన్నవించుకుంటున్నామని వరదల కారణంగా ప్రతి సంవత్సరం మేము పడుతున్న బాధ తమరికి తెలియనిది కాదని,తమరు మా యందు దయవుంచి పెద్దమనసుతో మా బాధలను అర్థం చేసుకొని చర్ల మండల కేంద్రంలోని మెరక ప్రాంతంలో వరద బాధితులమైన మాకు ఐదు సెంట్ల ఇంటి స్థలంను ఇచ్చి న్యాయం చేయవలసిందిగా కోరుతుంన్నామని అన్నారు.

 

రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం ఇవ్వాలని అన్నారు. 30 వేల రూపాయల ఆర్ధిక సహకారం అందించాలని అన్నారు. లేని యడల పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు. కాలయాపన చెయ్యకుండా వారం రోజుల్లో ఇళ్ల స్థలాలు చూపించాలనీ అన్నారు. ఇంటి జాగలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందనీ వరద బాధితుల పోరాట సంఘం చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి సి పి ఐ యం ఎల్ ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందనీ అన్నారు.

 

వరద బాధితుల పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలనీ కోరారు. కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా వరదబాధితులు ఐక్యంగా ఉద్యమించాలని అనంతరం
తహశీల్దార్ కి వినతి అందించారు.

 

ALSO READ :

1. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!

2. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!

3. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!

4. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

 

తప్పకుండా ఇంటి జాగాలు ఇస్తామని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో ఈ కార్యక్రమమును ముగించారు.
ఈ కార్యక్రమంలో సి పి ఐ యం ఎల్ డివిజన్ నాయకులు మునిగల శివ, చిమిడి సుజాత, కణితి భాను ప్రకాష్ బోడా సందీప్ సి పి ఐ యం ఎల్ ప్రజాపంథా నాయకులు చిప్పనపల్లి శ్రీకళ వీరమణి, చల్లా బాలు, సామ్రాజ్యం, నాగరత్నం మనోజ రమాదేవి పార్టీ వరద బాధిత పోరాటసంఘం కార్యదర్శి కొండా కౌశిక్, ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.