Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు
సేవాలాల్ జయంతి సందర్భంగా బి ఎల్ఆర్ ఆధ్వర్యంలో ర్యాలీ
సేవాలాల్ జయంతి సందర్భంగా బి ఎల్ఆర్ ఆధ్వర్యంలో ర్యాలీ
మిర్యాలగూడ, మన సాక్షి
శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ గిరిజనుల ఆరాధ్య దైవం అని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం సేవాలాల్ జయంతి సందర్భంగా ఉత్సవాలలో భాగంగా నాగు నాయక్, రవి నాయక్, సిద్దు నాయక్, గిరిజన నాయకులు బి ఎల్ఆర్ బ్రదర్స్ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

స్తానిక బి ఎల్ ఆర్ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి దగ్గర ఉన్నటువంటి సేవాలాల్ భవనం వరకు సేవాలాల్ పాలరాతి విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.









