Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో అర్ధరాత్రి వరకు కొనసాగిన ఏసీబీ దాడులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ లో గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో అర్ధరాత్రి వరకు కొనసాగిన ఏసీబీ దాడులు..!

మిర్యాలగూడ, మన సాక్షి,

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ లో గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఏసీబీ డి ఎస్ పి జగదీష్ చంద్ర నేతృత్వంలో ఇద్దరు సిఐలు, ముగ్గురు ఎస్ఐలు ఉదయం ఒక్కసారిగా కార్యాలయంలోకి వచ్చి సిబ్బంది నుండి సెల్ ఫోన్లు, ఫైల్స్ ను తీసుకొని మున్సిపల్ కార్యాలయ గేటుకు తాళాలు వేసి రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారుల రాకతో మిర్యాలగూడ మున్సిపాలిటీ ఒక్క సారిగా ఉళిక్కిపడింది. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో పలు అవినీతి అక్రమాలు జరు గుతున్నాయని సమాచారం అందడంతో పాటు పలు పనులు చేయకుండానే నిధులు డ్రా చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ సమాచారం. ఈ సోదాలు అర్థరాత్రి వరకు చేపట్టారు.

మరిన్ని వార్తలు