TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్
పేదవాడి ఫ్రిడ్జ్ కు భలే గిరాకీ..!
తెల్లారితే చాలు వేసవి భగ భగలు రోజు రోజుకు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. మండే ఎండల్లో చల్లని నీటి కోసం మట్టి కుండలకు బాగా డిమాండ్ పెరిగింది.

పేదవాడి ఫ్రిడ్జ్ కు భలే గిరాకీ..!
హన్వాడ, మన సాక్షి :
తెల్లారితే చాలు వేసవి భగ భగలు రోజు రోజుకు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. మండే ఎండల్లో చల్లని నీటి కోసం మట్టి కుండలకు బాగా డిమాండ్ పెరిగింది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో మట్టి కుండల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుండి వచ్చి ఇక్కడ మట్టి కుండలను పేద, ధనిక అనే తేడా లేకుండా మట్టి కుండలను ప్రజలు కొంటున్నారు.
కుమ్మరి సత్యమ్మ, నిర్వాహకులు హన్వాడ :
ఎండా కాలంలో ఫ్రిజ్ వాటర్ తాగడం ద్వారా జలుబు ఇతర అనారోగ్య సమస్యలు వస్తుండడంలో మట్టికుండల్లోని నీటిని తాగేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంటూ డాక్టర్లు కూడా చెబుతున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు ఎక్కువగా ఉండడంతో గిరాకీ పెరిగిందని కుండల తయారీదారులు పేర్కొంటున్నారు.










