Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : సహకార సంఘం బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం..!

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మిర్యాలగూడ మండలం తడకమళ్ళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పాదురు సంజీవరెడ్డి తోపాటు పాలకవర్గం వైస్ చైర్మన్ వీరపల్లి వెంకటేశ్వర్లు, డైరక్టర్లు గురువారం బాధ్యతలు చేపట్టారు.

Miryalaguda : సహకార సంఘం బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మిర్యాలగూడ మండలం తడకమళ్ళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పాదురు సంజీవరెడ్డి తోపాటు పాలకవర్గం వైస్ చైర్మన్ వీరపల్లి వెంకటేశ్వర్లు, డైరక్టర్లు గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాలు గత రెండు నెలల క్రితం రద్దుకాగా పాలకవర్గాలు దీనిపై కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు పాత కార్య వర్గాలని యధావిధిగా కొనసాగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు తడకమళ్ళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పాదురు సంజీవరెడ్డి తిరిగి పదవి బాధ్యతలను చేపట్టారు.

ఆయనతో పాటు వైస్ చైర్మన్ వీరపల్లి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు జిల్లా నాగయ్య, బొమ్మకంటి సత్యం, వొలిశెట్టి భాస్కర్, గుండు కోటయ్య, కొండెబోయిన శ్రీనివాస్, మన్నెం కొండల్ రెడ్డి, వస్కుల సూర్యం, మచ్చ సీతారాములమ్మ, పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ పాదురు సంజీవరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంటాలు వేసి కేటాయించిన మిల్లులకు ఎగుమతిచేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు