అధికారుల ఆదేశాలు బేఖాతర్.. నిబంధనలకు విరుద్ధంగా కల్వర్టులోకి పైపు లైన్..!
కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 120లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కరీంనగర్ -పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న భూమిలో ఓ వ్యక్తి ఆర్అండ్ బి అధికారులు వేసిన కల్వర్ట్ ను పూడ్చివేసి యదేచ్చగా పైపు లైన్ వేశాడు.

అధికారుల ఆదేశాలు బేఖాతర్.. నిబంధనలకు విరుద్ధంగా కల్వర్టులోకి పైపు లైన్..!
యాదేచ్చగా కొనసాగుతున్న నిర్మాణాలు
చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 120లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కరీంనగర్ -పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న భూమిలో ఓ వ్యక్తి ఆర్అండ్ బి అధికారులు వేసిన కల్వర్ట్ ను పూడ్చివేసి యదేచ్చగా పైపు లైన్ వేశాడు. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాలు కురిసినపుడు వర్షపు నీరు రోడ్డుపైకి వెళ్లకుండా వరద నీరు సులువుగా వెళ్లేందుకు అధికారులు అక్కడ కల్వర్ట్ నిర్మాణం చేశారు. కాగా ఇప్పుడు ఆ రోడ్డు పక్కనే ఉన్న భూ యజమాని నిబంధనలను తుంగలో తొక్కి అక్కడ భవన నిర్మాణం కోసం ఆ లోతట్టు ప్రాంతంలో పైపులు వేసి మొరంతో పూడ్చి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడు.
రానున్న వర్షాకాలంలో వరదలు భారీ స్థాయిలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, దింతో రాజీవ్ రహదారి వరద తాకిడికి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా పైపు లైన్ వేసి మొరంతో పూడ్చిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ అక్రమ పైపు లైన్ నిర్మాణాన్ని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులు నిర్వాహకులకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ అధికారుల నోటీసులను సైతం లెక్క చేయకుండా యాదేచ్చగా నిర్మాణాలు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మా దృష్టికి వచ్చింది.. నోటీసు ఇచ్చాము : గ్రామ కార్యదర్శి
ఈ అక్రమ పైపు లైన్ నిర్మాణం మా దృష్టికి వచ్చిందని గతంలో జానీ మియా అనే వ్యక్తి కి రెండు సార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవలే మూడో నోటీసు ఇచ్చి కొంత మేరకు కూల్చినట్లు కార్యదర్శి అనుమల అభినవ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని త్వరలో పూర్తి స్థాయిలో అక్రమ పైపు లైన్ నిర్మాణానన్ని కూల్చి వేస్తామని తెలిపారు.










