Miryalaguda : మిర్యాలగూడలో గోవా కల్చర్.. ఖరీదైన మద్యం, క్యాసినో గేమ్స్..!
గోవా కల్చర్ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు వచ్చింది. ఖరీదైన మద్యం, హుక్కా, పేకాట తో పాటు క్యాసినో గేమ్స్ కూడా వచ్చాయి. గోవా వెళ్లాల్సిన పని లేకుండా మిర్యాలగూడలోనే సీక్రెట్‌గా ఓ ఇంటిని అద్దె కు తీసుకుని ఏసి రూముల్లో పేకాట సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Miryalaguda : మిర్యాలగూడలో గోవా కల్చర్.. ఖరీదైన మద్యం, క్యాసినో గేమ్స్..!
మన సాక్షి, మిర్యాలగూడ :
గోవా కల్చర్ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు వచ్చింది. ఖరీదైన మద్యం, హుక్కా, పేకాట తో పాటు క్యాసినో గేమ్స్ కూడా వచ్చాయి. గోవా వెళ్లాల్సిన పని లేకుండా మిర్యాలగూడలోనే సీక్రెట్‌గా ఓ ఇంటిని అద్దె కు తీసుకుని ఏసి రూముల్లో పేకాట సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు శనివారం దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి సుమారుగా 92 వేల రూపాయలను, వాహనాలను, సెల్ ఫోన్ లను క్యాసినో కాయిన్స్, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో కొనకం విక్రాంత్ రెడ్డి, నల్ల రామకృష్ణ, మాధగోని రాజు, శేఖర్ రెడ్డి, కల్వల సతీష్, పర్వతనేని విక్రమ్, జగతి శేఖర్ ఉన్నట్లు సమాచారం. వీరంతా లక్ష్మీ కళ్యాణ మండపం వెనుక ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా అరెస్టు చేశారు. వీరి నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, క్యాసినో కైన్స్, 92,000 నగదు, లాప్టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- Kamareddy : కామారెడ్డి లో భారీ అగ్ని ప్రమాదం.. 12 దుకాణాలు దగ్ధం, కోట్లలో ఆస్తి నష్టం..!
- Breaking : కరీంనగర్ లో కాల్పుల కలకలం.. పట్టపగలు తుపాకులతో బెదిరించి గోల్డ్ షాప్ లో దొంగలు హల్ చల్..!
- పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్..!
- Miryalaguda : క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలిక.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..!