Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Kamareddy : కామారెడ్డి లో భారీ అగ్ని ప్రమాదం.. 12 దుకాణాలు దగ్ధం, కోట్లలో ఆస్తి నష్టం..!

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.

Kamareddy : కామారెడ్డి లో భారీ అగ్ని ప్రమాదం.. 12 దుకాణాలు దగ్ధం, కోట్లలో ఆస్తి నష్టం..!

మన సాక్షి, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో 12 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. బట్టల షాపులు, కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్ వస్తువుల విక్రయ కేంద్రాలు కాలిపోయిన దుకాణాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

మంటల దాటికి సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రెండు ఫైరింజనుల ద్వారా ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

ప్రాథమిక అంచనాల ప్రకారం కోటి రూపాయల పైగానే ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కుడా చదవండి : 

మరిన్ని వార్తలు