Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఉచిత వాలీబాల్, హ్యాండ్ బాల్ శిక్షణా శిబిరం ప్రారంభం..!

మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నూకల చారిటబుల్ ట్రస్ట్, బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాలీబాల్, హ్యాండ్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.

Miryalaguda : మిర్యాలగూడలో ఉచిత వాలీబాల్, హ్యాండ్ బాల్ శిక్షణా శిబిరం ప్రారంభం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నూకల చారిటబుల్ ట్రస్ట్, బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాలీబాల్, హ్యాండ్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఈ శిక్షణా శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఇటువంటి ఉచిత శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకొని శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని కోరారు. క్రీడలు క్రమ శిక్షణకు, నాయకత్వ లక్షణాలకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

వేదిక : ( గౌట్ ) జూనియర్ కళాశాల మైదానం మిర్యాలగూడ

శిక్షణ సమయం:

ప్రతిరోజు ఉదయం 6:00 గంటల నుండి 8:00 గంటల వరకు.
కాలపరిమితి: మే 01, 2026 నుండి మే 31, 2026 వరకు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోచ్ లు నాగరాజు గడగోజు అశోక్ చారి, మనోహర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు