సమ్మెలో పాల్గొనని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు
సమ్మెలో పాల్గొనని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు
మిర్యాలగూడ టౌన్ , ఏప్రిల్ 25, మన సాక్షి:
ఈనెల 25 నుండి సమ్మెలో పాల్గొంటామని మేనేజ్మెంట్ కు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసినదే.. కాగా కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా పూర్తిస్థాయి విధుల్లో పాల్గొన్నారని మిర్యాలగూడ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ అయితగాని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు మంగళవారం ఆయన మాట్లాడుతూ..
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 11 మండలాలు, 9 సెక్షన్లు అనగా మిర్యాలగూడ టౌన్ వన్, టౌన్ టు, రూరల్, వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, నిడమనూర్, హాలియా, పెద్దవూర, తిరుమలగిరి, నాగార్జునసాగర్, మండలాలకు సంబంధించిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా పూర్తిస్థాయిలో విధులకు హాజరైనారని తెలిపారు.
ఆర్టిజన్ కార్మికులు ఎవరి సెక్షన్లో వారు డ్యూటీల లో ఉన్నారని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ఏడిఈ లు. వేణుగోపాల్, రవీందర్ రెడ్డి, .. ఏఈ లు. మిర్యాలగూడ రూరల్, కిషన్ లాల్, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..









