Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
విద్యుత్ ఘాతంతో గేదెలు మృతి
విద్యుత్ ఘాతంతో గేదెలు మృతి
మాడుగులపల్లి, మనసాక్షి:
విద్యుత్ ఘాతంతో మూడు గేదెలు మృతి చెందిన ఘటన మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెద్దదేవులపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితురాలు అల్లం లక్ష్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం..
రోజు మాదిరిగా గేదెలను గ్రామ సమీపంలో మేపుతుండగా గురువారం రాత్రి వీచిన గాలులకు తేగిన కరెంటు వైర్లు మేత మేస్తున్నా 3 గేదెలకు తగిలి మరణించాయని తెలిపారు. గేదెల విలువ సుమారు ఒక లక్ష యాభై వేల వరకు ఉంటుందని కావున ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.









