Project : మూసికి కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. గేట్లు ఎత్తి నీటి విడుదల..!
Project : మూసికి కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. గేట్లు ఎత్తి నీటి విడుదల..!
సూర్యాపేట రూరల్, మన సాక్షి :
ఎగువనుంచి భారీగా వరద నీరు వచ్చి మూసి ప్రాజెక్టులో చేరడంతో నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో ఇవ్వాల (సోమవారం) 644.60 అడుగుల లెవల్‌కు వాటర్ చేరింది.
ALSO READ : Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!
ఇక.. ప్రాజెక్టు నీటి మట్టం 645 అడుగులు కాగా, ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 243.16 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు.ప్రాజెక్ట్ నుండి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.
దీంతో అధికారులు ఉదయం 3 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో డీఈ చంద్రశేఖర్, ఏఈలు ఉదయ్ కుమార్, మమత, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు.









