Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

President : సామాన్య మహిళతో రాష్ట్రపతి ముఖాముఖి, అరుదైన అవకాశం

సామాన్య మహిళతో రాష్ట్రపతి ముఖాముఖి, అరుదైన అవకాశం

మెలియాపుట్టి. మనసాక్షి:

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో గల పలువురు గిరిజనులతో ఈనెల 12వ తేదీన ముఖాముఖి అవుతున్న విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలానికి చెందిన సవర శాంతి కుమారిని సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి ఎంపిక చేశారు.

 

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని పరుసరాంపురం పంచాయతీ పరిధిలో గల నందవ గ్రామానికి చెందిన మహిళ కావడం విశేషం.ఈమె ఇప్పటికే ఎస్ హెచ్ జి కి,మండల సమాఖ్యకు అధ్యక్షురాలు గా, జిల్లాకు ఉపాధ్యక్షురాలు గా గిరిజన సమాఖ్యకు ఈసీ మెంబర్ గా ఉన్నారు.

 

ALSO READ : Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

 

అయితే ఈ నేపథ్యంలో మెళియాపుట్టి వెలుగు ఏపీఎం లలిత మాట్లాడుతూ వందన వికాస కేంద్రాన్ని గూర్చి రాష్ట్రపతికి వివరించుటకు తమ మండలం నుండి శాంతి కుమారి పాల్గొంటారని తెలిపారు.ఆమెను ఐటిడిఎ పీఓ ఎంపిక చేశారు.

 

తమ మండలవాసిని దేశ రాజధానికి భారత రాష్ట్రపతిని మాట్లాడేందుకు పంపించడం తమందరికి ఎంతో గర్వకారణమని ఆనందాన్ని వ్యక్తపరిచారు.అనంతరం శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రపతితో మమేకమవుటకు ఢిల్లీకి తనను ఎంపిక చేసినందుకు ఐటిడిఎ పీఓ కి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు